ఇండోనేషియా: రాత్రి ఇంటివద్ద నుంచి కనిపించకుండా పోయిన ఒక మహిళ మృతదేహం కొండచిలువ పొట్టలో దొరికింది. ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి ప్రొవిన్స్ లోని కలెంపాంగ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురు పిల్లల తల్లి అయిన 45 ఏళ్ల ఫరిదా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. మరునాటి ఉదయం ఆమె భర్త, గ్రామస్థులు కలిసి వెతుకుతున్నప్పుడు ఆమెకు సంబంధించిన వస్తువులు ఒక చోట కనిపించాయి. అక్కడికి సమీపంలోనే ఒక పదహారు అడుగుల పొడవున్న భారీ కొండచిలువను గ్రామస్థులు పేర్కొన్నారు. ఆ కొండచిలువ పొట్టభాగం బాగా ఉబ్బివుండటాన్ని గమనించారు. ఆ కొండచిలువను చంపేసి, దాని పొట్టభాగాన్ని కత్తిరించాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఆ గ్రామపెద్ద సౌర్దిరోసితో కొండచిలువను చంపి, దాని పొట్టభాగాన్ని కోసినపుడు ఫరీదా తల బయటపడింది. మొత్తంగా ఫరీతా దేహాన్ని వెలికితీశారు. ఆమె పూర్తి దుస్తులతోనే ఉండడాన్ని గమనించారు. ఆమెను పూర్తిగా కొండచిలువ మింగేసింది.
ఇలాంటి విషాదకరమైన సంఘటనే గత ఏడాది ఈశాన్య సులవేసిలోని టినగ్గియా జిల్లాలో జరిగింది. ఒక ఎనిమిది అడుగుల కొండచిలువ ఒక రైతును మింగేసింది. 202లో జాంబి ప్రాంతంలో రబ్బర్ తోటకున ఒక 50 ఏళ్ల మహిళ సాయంత్రానికీ తిరిగి ఇంటికి వెళ్లి చూసిన గ్రామస్థులు వెతుకుతున్నపుడు ఒక కొండచిలువ ఆమెను మింగేసినట్టు పేర్కొన్నారు. అంతకుముందు 2017, 2018లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.