
‘ఫైర్ అండ్ ఐస్’ సాంగ్ లాంఛ్
జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్”. చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఇ. చేశారు. ఊర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా ఉన్నారు. పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ఈ సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్ ను హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో
యాక్టర్‌కమ్, లైన్‌ప్రొడ్యూసర్ దశరధ్ మాధవ్ మాట్లాడుతూ… మా కిల్లర్ టీమ్ డివైన్‌గా చేసిన మూవీ. ఒక ప్యాషన్‌తో ప్రతీ డిపార్ట్‌మెంట్ ఎంతో కష్టపడి చేశారు. నేను స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పాలంటే మా పూర్వజ్ సుక్కుసార్‌కి చెప్తాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక పనిని ఇష్టపడి కష్టపడి చేస్తే నష్టమనేది ఉండదు అని నమ్మే వ్యక్తి సుక్కుసార్. సినిమా గురించి ఎంత చెప్పినా ఏమి చెప్పినా గంటలు తరబడి కూర్చొని ఓపికగా పని చేస్తారు.
ఆ ప్రతిఫలమే కిల్లర్ మూవీ. ఇది ఓన్ మ్యాన్ షో అని చెప్పాలి. అదే విధంగా జ్యోతిగారి గురించి కూడా అందరూ మాట్లాడుకుంటారు. ఈ మూవీ తరువాత ఈ పేరు చాలా గట్టిగా వినపడుతుంది. ఈ రోజున టెక్నాలజీని వాడుకుంటూ అన్ని క్రాఫ్ట్స్‌పైన ఒక మంచి అనుభవంతో తీసిన చిత్రమే కిల్లర్. మీతో జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. జ్యోతిగారి గురించి చెప్పాలంటే ఈ చిత్రంలో నేను జ్యోతిగారి తమ్ముడి పాత్రలో కనిపిస్తాను. ఒక ఎమోషనల్ బ్యాండింగ్. మీ కంపారిషన్ మీ కరేజియస్ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. ఈ మూవీ కోసం బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పని చేశాం. ఎలాగైనా కొట్టాలని మంచి కాన్ఫిడెంట్‌గా పని చేశాము అన్నారు. చావా రేవా అన్నట్లు చేశారు.
డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ – తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. టైం లో మేము చేసిన “కిల్లర్” సినిమా మరో సరికొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఐదు డిఫరెంట్ రోల్స్ లో నటించింది. స్పై, వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై ఇలా ఐదు భిన్నమైన పాత్రల్లో ఆమె అద్భుతంగా నటించింది. వీటిలో కొన్ని క్యారెక్టర్ లుక్స్ ను పరిచయం చేశాం.
వాటికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర కథకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఎలిమెంట్స్ ముడిపడి ఉంటాయి. ఈ ఐదు పాత్రలు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ముడిపడి ఉన్న ఆ ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. మీరు ఇప్పుడు చూసిన గ్లింప్స్ అయినా, సాంగ్ అయినా మ ర ష్ లో 3 పర్సెంట్ కూడా ఉండవు. ఇతర కంటెంట్ సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. నేను మాస్టర్ పీస్ అనే సినిమా చేస్తున్న టైం లో “కిల్లర్” మూవీ ఆలోచన వచ్చింది. ఈ సినిమాను ప్రదర్శించేందుకు ప్రొడ్యూసర్ పద్మనాభరెడ్డి, ఇతర టీం అంతా చాలా సపోర్ట్ చేశారు.
The post ఇష్టపడి కష్టపడి చేస్తే నష్టమనేది ఉండదు అని నమ్మే వ్యక్తి సుక్కుసార్- దశరధ్ మాధవ్ appeared first on Mudra News.