60
ముద్ర,తెలంగాణ:- కేంద్రం ఎన్డీఏ సర్కార్ సాయంత్రం కొలువుదీరనున్నది. కేబినెట్‌లో బెర్త్‌లపై అందరి దృష్టి పడింది.ప్రతి పది మంది ఎంపీలకు ఒక మంత్రి పదవి కేటాయించాలని, అలాగే భాగస్వామ్య పార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇవ్వడానికి ఎన్‌డీఏ నిర్ణయించిందని తెలియడంతో రాష్ట్రానికి ఒకరికి చోటు దక్కుతుందని అందరూ ఊహించారు. అందరి ఊహాలకు భిన్నంగా ఇద్దరికి మంత్రి పదవులు లభించాయి. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రి పదవులు వరించారు.