ముద్ర,తెలంగాణ:- మల్టీ జోన్ -1 ఐజీగా ఉన్న ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. ఇప్పటి వరకు హైదరాబాద్ జీహెచ్‌సీ పరిధికి పరిమితమైన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పోస్ట్‌ను అప్‌లోడ్ చేసి హెచ్‌ఎండీఏ పరిధికి విస్తరిస్తూ ప్రభుత్వం చార్యలు తీసుకుంది. ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది.
ఇప్పటివరకు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు, నాళాల ఆక్రమణలు.. చెరువుల ఆక్రమణలన్నీ సమూలంగా నిర్మూలించే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్‌చార్జిగా రంగనాథ్‌కు ప్రభుత్వం బాధ్యత వహించింది. ఈ విభాగం ముఖ్య మంత్రి ఆధీనంలో ఉండనుంది. కాగా, కమాండ్ కంట్రోల్ రూమ్ (బంజారా హిల్స్) కేంద్రంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఏర్పాటు కానున్నట్టు సమాచారం. ఇక.. హెచ్ఎండీఏ పరిధిలో కబ్జాల మీద ఉక్కుపాదం మోపే బాధ్యత ముఖ్య మంత్రి పర్యవేక్షణలో ఐజీ రంగనాథ్ చేపట్టనున్నారు.