ముద్ర,తెలంగాణ:- మాజీ మంత్రి కేటీఆర్‌కు, ఈసీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ పిటిషన్ దాఖలు అయిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు అనే మరో వ్యక్తి హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో కొడుక్కి ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు జడ్జి విచారణ నామవరపు రాజేశ్వరరావు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేయబడింది.
సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలో 32 ఎకరాలు, శివారు వెంకటాపూర్‌లో మరో 4 ఎకరాల కొడుకు హిమాన్షు పేరు ఉందని.. కానీ ఎన్నికల అఫిడవిట్‌లో ఆ ఆస్తులను ప్రస్తావించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. గతేడాదే మేజర్ అయిన కొడుకు హిమాన్షు సొంత డబ్బుతో భూములు కొనే అవకాశం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అఫిడవిట్‌లో నిజాలు దాచిన కేటీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.