సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజుని కలిసి భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పూల రవీందర్ వినతి పత్రం అందించారు. కొత్తగూడెం సింగరేణి ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ నియామకాన్నీ కొంతమంది దొడ్డి దారిన పట్టిస్తున్నారని ఆరోపించారు. కనీసం పబ్లికేషన్ లేకుండా 21 మంది అభ్యర్థులను నాన్ లోకల్ వాళ్లను ఒక్కొక్క అభ్యర్థి నుండి 2 లక్షల రూ.లు దండుకొని నియామకాలకు తెరలేపారాణి పేర్కొన్నారు. ఈ అక్రమార్గంలో సెక్యూరిటీ గార్డులను నియమించుకునే సాయిరాం ఏజెన్సీ, మరియు కొంతమంది బయటి వారి ప్రమేయం ఉందని తెలిపారు. వెంటనే విషయంపై సమగ్ర విచారణ జరిపి సాయిరాం ఏజెన్సీని రద్దుచేసి కాంట్రాక్టర్ను బ్లాక్లిస్టులో పెట్టాలని, దోషుల పైన కేసులు నమోదు చేయించాలని కోరారు. ఇప్పటికైనా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ నియామకం సక్రమ మార్గంలో పబ్లికేషన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి దేహదారుడ్య పరీక్షలు చేయించి అర్హులైన లోకల్ వాళ్లను నియామకం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి. అజయ్ కుమార్, పిల్లి. శ్రీకాంత్, దేవా, తదితర కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
దొడ్డి దారిన చేపడుతున్న కొత్తగూడెం సింగరేణిఏరియా ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ నియామకాన్ని వెంటనే ఆపాలి: పూల రవీందర్
25