Home » ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లు ఆన్‌లైన్‌లో చేర్చాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లు ఆన్‌లైన్‌లో చేర్చాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లు ఆన్‌లైన్‌లో చేర్చాలి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ఆర్ ఓ ఆర్ ముసాయిదా బిల్లు 2024 పై చర్చలో వక్తలు

సిద్దిపేట, ముద్రణ ప్రతినిధి: నా లాలు, కుంటలు, చెరువులు కబ్జాలకు గురి కాకుండా ఎల్టీ ఎఫ్, బఫర్ జోన్ ల ఏరియా చూపించేలా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని అధికారులకు వక్తలు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ సమావేశ మందిరంలో తెలంగాణ ప్రభుత్వ నూతన ఆర్ఓఆర్ 2024 ముసాయిదా బిల్లుపై చర్చా వేదిక జరిగింది. ఈ వేదికలో ముందుగా అదనపు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక తాసిల్దార్ వెంకటరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన ఆర్ఓఆర్ 2024 ముసాయిదా బిల్లులోని 20 అంశాలను వివరించారు.

ఈ సందర్భంగా అడ్వకేట్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, జర్నలిస్టులు, ట్రెసా (తెలంగాణ ప్రాతిపదికన ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్) ప్రతినిధులు వేరువేరుగా కొత్త చట్టంలో భూ రికార్డులు ఆన్‌లైన్‌లో ఆఫ్ లైన్‌లో కూడా ఉంచాలని, రైతు కుటుంబం అన్నప్పుడు కుటుంబానికి సరైన వివరణ పొందాలని, లీగల్ విల్ డీడ్ చేసినప్పుడు దాని ప్రామాణికంగా పూర్తి ఒప్పందాలు, ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములకు కూడా కాస్తుదారు ఉండాలని, ఆ తర్వాత అధికారులు వివిధ పనులతో మంజూరు చేస్తారు, కాబట్టి భూములు కొనుగోలు సబ్ రిజిస్టర్ల ద్వారా మాత్రమే జరిగేలా చూడాలని, సవరణ రిజిస్టర్ ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. హిడెన్ ఫైల్స్ అనేవి ఉండకూడదని, ధరణిలో జరిగిన పొరపాట్లను ఆర్డీవో ద్వారా పరిశీలించి సరి చేసే అధికారం కల్పించాలన్నారు.

భూ సమస్యల శాశ్వత పరిష్కార వేదిక జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని, జవాబుదారీతనంతో కూడిన విఆర్వో వ్యవస్థను మళ్లీ ప్రవేశపెట్టాలని, క్షేత్రస్థాయి రికార్డు రికార్డులపై ఆజమాయిషీ తాసిల్దార్లు వద్దనే ఉండాలని, విల్ డీడ్ చేస్తే సాక్షాత్తు విచారించి, మున్సిపల్ ప్రాంతాల్లో నాలాలు చెరువులు కబ్జాకు గురి కాకుండా, బఫర్ జోన్ మ్యాపులు రూపొందించాలని, అప్పీల్ అధికారాలు ఆర్డిఓకు జాయింట్ కలెక్టర్ కి పెట్టాలని, రెవిన్యూ కోర్టులకు బదులుగా రిటైర్డ్ జడ్జిలు / రిటైర్డ్ కలెక్టర్లు/ రిటైర్డ్ జైంట్ కలెక్టర్లతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు, ఆర్ఓఆర్ 2024 యాక్టును ధరణి రిఫరెన్స్ కు బదులుగా 2017 రికార్డు ప్రకారం రూపొందించబడింది. వివాదస్పద అంశాల నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, ఇప్పుడున్న సాదా బైనామా కేసులను ఆరు నెలల్లో పరిష్కరించాలని కొత్త సాధ భైనామాలు జరగకుండా చూడాలని, ఎన్ఐసీ ఆర్ ద్వారాఓఆర్ చట్టాన్ని అమలు చేయాలని, సలహాలు సూచనలు ఇచ్చారు.

మీ సలహాలు, సూచనలు, రికార్డులు చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం….జిల్లా కలెక్టర్ మను చౌదరి

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి మాట్లాడుతూ తెలంగాణ ఆర్ఓఆర్ 2024 ముసాయిదా బిల్లు గురించి మేధావులకు, అడ్వకేట్ లకు, ప్రజాప్రతినిధులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు, జర్నలిస్టులకు, ప్రజలకు అవగాహన కల్పించే చట్టంలో పొందుపరచవలసిన 20 అంశాల నుండి వారి సలహాలు, సూచనల కోసం చర్చా వేదిక నిర్వహించడం జరిగింది. ఈ చర్చా వేదికలో మీరు ఇచ్చిన సలహాలు, సూచనలను ప్రతి ఒక్కటి రికార్డు చేయడం గురించి ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, బన్సీలాల్ రామ్మూర్తి, కలెక్టరేట్ ఏవో రెహమాన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యులు, ట్రెసా సభ్యులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in