ఉమ్మడి మద్దూరు మండలంలో మంగళవారం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆఫీసర్(KADA )వెంకట్ రెడ్డి కొత్తపల్లి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కొత్తపల్లి మండలంలో ఉన్న 11 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఆయన పర్యటించారు. మొదట భూనేడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఐదు అదనపు భవనాలు కావాలని కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి కోరడంతో కడ అధికారి వెంకట్ రెడ్డి వెంటనే మంజూరు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధంగా దుప్పటి గట్ గ్రామంలో గతంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి ఎండోమెంట్ కావాలని 10 లక్షలు కాంట్రిబ్యూషన్ అమౌంట్ కట్టగా అది పెండింగ్ లో ఉండగా ఎండోమెంట్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని, అదే విధంగా అంగన్వాడీ సొంత బిల్డింగ్ నిర్మాణానికై రెండు కొత్త భవనాలు మంజూరు చేయిస్తామన్నారు. ప్రత్యేకంగా నిడ్జింత గ్రామానికి మోడల్ అంగన్వాడి స్కూలు మంజూరు చేస్తామన్నారు. అలాగే కొత్తపల్లి మండలంలోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆఫీసర్(KADA )వెంకట్ రెడ్డి కొత్తపల్లి మండలంలో సుడిగాలి పర్యటన..
3
previous post