104
పద్మనాభంలో ఉచిత వైద్య శిబిరాన్ని ‘సహాయత హెల్పింగ్ హేండ్స్ ఆర్గనైజషన్’ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, జనరల్ ఫిజీషియన్, ఈఎన్‌టీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, నర్సులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ సమయాన్ని నైపుణ్యాన్ని స్వచ్ఛందంగా అందించారు. దీంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు, ప్రాథమిక వైద్య సామాగ్రిని పంపిణీ చేశారు. 200 మందికి పైగా నివాసితులు శిబిరానికి హాజరయ్యారు. ఈ వైద్య శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ డాక్టర్ శ్రీకాంత్ కాటుమూరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.