9
కొత్తగూడెం మున్సిపల్ పరిధి లోని రామవరం ప్రధాన సెంటర్లో గల ఓపెన్ గ్రౌండ్స్ వద్ద తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీత శ్రావ్య టీవీ తో మాట్లాడారు. ప్రస్తుతం అధికారం కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఎంతగానో ప్రత్యేకత సంతరించుకుందని.. పండుగ సంబరాల ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని అన్నారు.