30
వాహనంతో సహా రూ.20 లక్షల విలువైన ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు డీఎఫ్‌వో జె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అటవీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి రాయచోటి–రాజంపేట మార్గంలోని నాయునివారిపల్లె సమీపంలో తనిఖీలు నిర్వహించారు. మహీంద్ర ఎక్స్‌యూవీ వాహనంలో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా అటవీ అధికారులను గమనించిన దుండగులు వాహనాన్ని వదలి పరారయ్యారు. వాహనంలో 305 కిలోల బరువు గల పది ఎర్రచందనం దుంగలున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వెంకటరమణ, కె.ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.