40
NEETతో పాటు పలు పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీలను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI, AISF, PDSU వంటి యూనియన్లు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి బంద్ నోటీసులు కూడా ఇచ్చాయి. మరోవైపు తెలంగాణలో నిరుద్యోగ సంఘాలు DSCని 45రోజులు వాయిదా, టెట్ నార్మలైజేషన్, జాబ్ క్యాలెండర్ ప్రకటన, గ్రూప్1 పోస్టుల్లో 1:100 నిష్పత్తి వంటి డిమాండ్లతో బంద్‌కు పిలుపునిచ్చాయి.