పెందుర్తి నియోజకవర్గం ముత్యాలమ్మ పాలెం సముద్ర తీర గ్రామంలో N T P C & ఫార్మా కంపెనీల వ్యర్థలను శుద్ధి చెయ్యకుండా కలిసిన కలుషితమైన నీటిని పైప్ లైన్స్ ద్వారా సముద్రం లోకి వదలడం వలన తీరంలో భారీగా మత్స్య సంపద చేపలు, రొయ్యలు, పీతలు, చనిపోయి ఒడ్డుకు చేరడం జరిగింది. దీంతో మత్స్య కారుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు పెందుర్తి ఇంచార్జి బంగారు రమణ, జిల్లా అధ్యక్షులు గురీ చిన్నారావు, అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు గొట్టివాడ శుభాషిణి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ విధంగా కొనసాగితే తీర ప్రాంతల ప్రజలు జీవనోపాధి కోల్పోయి వందలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టి సమస్యను పరిష్కారం చూపాలని.. లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద బహుజన సమాజ్ పార్టీ, స్థానిక మత్యాకారుల తో కలిసి ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఫార్మా కంపెనీల నుంచి వచ్చే విషపూరితమైన రసాయానాలకు భారీగా మృతి చెందిన సముద్ర మత్స్యసంపద..
47
previous post