Home » త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఫేక్ ఫోటోను వెంటనే గుర్తించే స్పెసిఫికేషన్

త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఫేక్ ఫోటోను వెంటనే గుర్తించే స్పెసిఫికేషన్

by v1meida1972@gmail.com
0 comment

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ తన యూజర్లను అట్ట్రాక్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అందులో భాగంగానే ఇన్స్టాగ్రామ్(Instagram) తరహాలోనే అనేక ఫీచర్స్ని వాట్సాప్లోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే వాట్సాప్‌ తాజాగా ‘సెర్చ్ ఇమేజెస్ ఆన్ ది వెబ్’ అనే కొత్త ఫీచర్ ను తీసుకురాబోతుంది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమకు చాట్‌లో వచ్చిన ఇమేజెస్‌ను గూగుల్‌లో వెళ్లి సెర్చ్ చేయవచ్చు.ఈ ఫీచర్‌ ద్వారా ఆ ఫొటో నిజమేనా కాదా లేక ఎడిట్ చేసిందా? అని తెలుసుకోవచ్చు. అలాగే ఫోటోను ఎక్కడి నుంచి తీసుకున్నారు? అనే సమాచారం సులభంగా తెలిసిపోతుంది. ఈ ఫీచర్ వల్ల తమ యూజర్ల గోప్యతకు ఎలాంటి ముప్పు ఉండదని, ఇది కేవలం ఆప్షనల్ ఫీచర్ అని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని, త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి రానుందని వెల్లడించింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in