42
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆద్వర్యంలో అర్టిఫిషియల్ లింబ్ మాన్యుఫ్యాక్షరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహాకారంతో నాలుగు రోజుల దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ఎంపిక కార్యక్రమంలో భాగంగా ఐ.డి.ఓ.సీ.కలెక్టర్ కార్యాలయం- పాల్వంచ వద్ద దివ్యాంగుల సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాల్వంచ వద్ద జరిగిన ఎంపిక శిబిరంలో 178 మంది, గుండాల, అశ్వారావుపేట, భద్రాచలం వద్ద జరిగిన శిబిరాల్లో మొత్తం 447 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్స్, ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు, ఆంథుల చేతికర్రలు, కృత్రిమ అవయవాలు, చంకకర్రలు కొరకు ఎంపిక చేయడం జరిగింది.