11
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో నిర్మించారన్న ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. మేడ్చల్, మల్కాజ్ గిరిలోని, వెంకటాపూర్ నడం చేరవు పరిధి బఫర్ జోన్లో అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్మించారని పోచారం ఐటీసీ, మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఈఈ పరమేశ్వర్. ఆయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అక్రమ నిర్మాణలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. తాజాగా టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు.