ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గంలోని నిరుద్యోగ అభ్యర్థులను రానున్న పోటీపరీక్షలకు సన్నద్ధం చేసే ఉద్దేశ్యంతో రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న పొంగులేటి శీనన్న ఉచిత కోచింగ్ క్యాంప్ ను బుధవారం ఉదయం 10గంటలకు ప్రారంభించినట్లు పొంగులేటి కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట సర్కిల్ బైపాస్ రోడ్ లో ఉన్న రామ్ లీలా ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కోచింగ్ క్యాంప్ ప్రారంభం అయినట్లు ఆయన తెలియజేశారు. కోచింగ్ క్యాంపుకి పేరు నమోదు చేసుకున్నఅభ్యర్థులు అందరూ సకాలంలో హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటితో పాటు.. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి , రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వా విజయబాబు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు హాజరయ్యారు.
పొంగులేటి ఉచిత కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాస్
53