39
ఖాజీపేటలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఖాజీపేట కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకారులు మానవహారంగా నిలబడి నినాదాలు చేస్తూ ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరారు.