10
కొల్లాపూర్ పట్టణంలోని 5వ వార్డులో ప్రభుత్వ జిల్లా పరిషత్ మాడల్ పాఠశాలను మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రతి తరగతి తిరిగి అధ్యాపకుల విద్యా బోధనపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థినిలకు అందించే డిజిటల్ బోధన కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలను అభివృద్ధి చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు.