62
పులివెందులలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న మహిళా మార్ట్ అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మహిళా మార్ట్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా మార్ట్ లో తక్కువ ధరలకు సరుకులు అమ్మాల్సి ఉండగా బయటి మార్కెట్లో ఏ ధరలు ఉన్నాయో అవే ధరలు ఉన్నాయన్నారు. మహిళా మార్ట్ లో రూ.లక్షల అవకతవకలు జరిగాయన్నారు. వీటిపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.