25
గోదావరి వరద కారణంగా ముంపు బారిన పడిన బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అచ్చేన్న నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. ఆదివారం కె. గంగవరం మండల పరిధిలోని కోటిపల్లి గ్రామంలో ముంపు ప్రభావిత ప్రాంతాలను, మత్స్యకార కాలనీ సందర్శించారు. అనంతరం కోటిపల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో వరద సహాయక చర్యలలో భాగంగా ఏర్పాటుచేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు పశువులకు సంబంధించిన గడ్డి విత్తనాలు రైతాంగానికి పంపిణీ చేశారు.