3
ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల దేవత అయిన ‘ఏత్మాసూర్’కు గిరిజన చిన్నారులు, యువకులు తలనీలాలతో పాటు కనుబొమ్మలు సమర్పించే ఆచారం ఏళ్లుగా కొనసాగుతోంది. వీటిని సమర్పించే సమయంలో వెంట్రుకలు కింద పడకుండా ఇంటి ఆడపడుచులు లేదా మేనత్తలు కొంగు చాచి పట్టుకుంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని మారుతిగూడ గ్రామానికి చెందిన 100 మంది శుక్రవారం కనుబొమ్మలతో పాటు తలనీలాలను సమర్పించి ఏత్మాసూర్ దేవతకు మొక్కు తీర్చుకున్నారు.