7
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పలువురి కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. కొల్లాపూర్ మండలం ఏన్మన్ బెట్ల గ్రామానికి చెందిన మరాఠీ కురుమయ్య గుండె సంబధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. అదే హాస్పిటల్ లో గుండె సంబధిత చికిత్స పొందుతున్న కోడేరు మండలం తీగలపల్లి గ్రామానికి చెందిన భాగ్యమ్మ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ధైర్యం చెప్పారు.