6
లండన్ వేదికగా మూడురోజుల పాటు జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ తో కలిసి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను షెకావత్ సందర్శించారు. బతుకమ్మ వేడుకలను తిలకించారు. మంత్రి జూపల్లి షెకావత్ ను సన్మానించి, చార్మినార్ జ్ఞాపికను అందజేశారు.