5
ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ (35) హఠాన్మరణం చెందారు. రియాల్టీ షో ‘దాదాగిరి 2’ విజేతగా పేరుగాంచిన నితిన్ గురువారం ముంబైలో మరణించారు. యూపీలోని అలీఘర్‌కు చెందిన నితిన్ ‘దాదాగిరి 2’ విజయం తర్వాత ఫేమస్ అయ్యారు. అలాగే MTV యొక్క ‘స్ప్లిట్స్‌విల్లా 5, జిందగీ డాట్ కామ్, క్రైమ్ పెట్రోల్, ఫ్రెండ్స్ వంటి ఎపిసోడిక్ సిరీస్‌లతో సహా అనేక ఇతర షోలలో కనిపించారు. నితిన్ మృతితో టీవీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.