- తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి
- వచ్చే నెలలో మలేషియా పారిశ్రామికవేత్తలు రాష్ట్ర సందర్శన
- మలేషియాలోని తెలంగాణ దశాబ్ధి వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉందని ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు ఆదివారం మలేషియా కౌలాంపూర్‌లో జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్ ఆర్ ఐలు మలేషియా పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు.. సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సులభతర వాణిజ్య విధానాలతో తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వ్యాపారవేత్తలకు ఆయన అందుబాటులోకి వచ్చారు. మలేషియా – భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామని అన్నారు.
మలేషియా పారిశ్రామికవేత్తలకు డిసెంబర్ లో తెలంగాణ సందర్శన కోసం ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇదిలావుండగా, తన రాజకీయ ప్రస్థానం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలను మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తనను రాజకీయంగా ప్రోత్సహించి, ఆదరించిన మిత్రులకు సహచరులకు , ప్రజలకు శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. రెండున్నర రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీలో తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే వంటి సీనియర్ నేతలకు ఎప్పటికి రుణపడి ఉంటానన్నారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశానని , వారు తన పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపించారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి నిర్వహించారు.