53
పులివెందుల పట్టణంలో బాలుడి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం పట్టణంలోని పుల్లారెడ్డి హాస్పిటల్ సమీపంలోని కాలనీలో గురువారం ఉదయం బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఒక వ్యక్తి విఫలయత్నం చేశాడు. కాలనీలో నివాసముంటున్న పవన్, రాధల కుమారుడు ఒంటరిగా తిరుగుతుండగా ఓ వ్యక్తి కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని తెలిపారు. స్థానికులు కేకలు వేయడంతో ఆ వ్యక్తి బాలుడిని వదిలిపెట్టి పరారయ్యాడని చెప్పారు.