19
అర్హులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు రాకపోవడంతో పథకాలు అందలేదని, వారందరికీ రేషన్ కార్డు అందించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రేషన్ కార్డు విధానం ఎత్తివేశారనే ప్రచారంలో నిజం లేదని సీఎం స్పష్టం చేశారు. అన్ని సంక్షేమ పథకాలను ఈ డిజిటల్ కార్డుతో అనుసంధానం చేస్తామన్నారు.