ముద్ర ప్రతినిధి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. చీఫ్ వార్డెన్ పై ఆరోపణలు చేస్తూ వెలువడ్డ కరపత్రం దరిమిలా చీఫ్ వార్డెన్ కు మద్దతు తెలుపుతూ శుక్రవారం రాత్రి ట్రిపుల్ ఐటీ తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ సాలిడారిటీ. (టిఎస్ఎస్ ) సంఘం అధ్యక్షుని పేరుతో పత్రిక ప్రకటన విడుదల చేయబడింది. చీఫ్ వార్డెన్ గా శ్రీధర్ పనిచేస్తున్నప్పటినుంచి కేర్ టేకర్లను ఎక్కువ సంఖ్యలో నియమించాలని రాతపూర్వకంగా తెలిపిన వారు పట్టించుకోలేదని వారు ప్రకటనలో పేర్కొన్నారు.
తొమ్మిది వేల మంది విద్యార్థులకు కేవలం నలుగురు కేర్ టేకర్లు మాత్రమే ఉన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ తనిఖీల్లో కూడా తేలిందని వారు పేర్కొన్నారు. వీసీ ఈ పక్కదారి పట్టించడానికి చీఫ్ వార్డెన్ పై కావాలని నిందలు మోపబడి వారు ఆ ప్రకటనలో ఉన్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకున్న ఘటనలు నియంత్రణ, పర్యవేక్షణలోపం వల్లే జరుగుతున్నాయని వారు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. చీఫ్ వార్డెన్ అందించిన ఆధారాలను పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలి.