పి.గన్నవరం మండలం ఊడిమూడి లంక వద్ద గోదావరి నదీ పాయలో పడవ బోల్తా పడింది. లంక ప్రాంతం నుంచి అవతలకి పడవపై మంచినీటి ప్యాకెట్ బస్తాలు తరలిస్తుండగా గోదావరి మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతవగా ఐదుగురు సురక్షితంగా బయట పడ్డారు. లైఫ్ జాకెట్లే ఈ ఐదుగురి ప్రాణాలు కాపాడాయి. లేకపోతే ఘోర ప్రమాదమే జరిగిపోయేది. లైప్ జాకెట్ ధరించని చదలవాడ విజయ్ కుమార్(26) గోదావరిలో గల్లంతయ్యాడు. ఇతను గంటిపెదపూడి పంచాయతీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకొన్న జిల్లా కలెక్టర్ రవిలాల మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్, RDO, పి గన్నవరం కూటమి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అక్కడికి చేరుకొని గల్లంతైన వ్యక్తి కోసం స్థానికులతో ఇంజన్ బోట్లపై గాలింపు చర్యలు చేపట్టారు.