63
ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ తల్లితండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం గూళ్యం గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన ఆశాబి, సబియా, ఆఫ్రిన్ చిన్నారులకు సంస్థ సభ్యులు సహకారంతో లక్షల రూపాయలు, కర్నూలు జిల్లా సంస్థ సభ్యులు పింజారి. హుస్సేన్ వారి మిత్రుల సహకారంతో లక్ష రూపాయలు మొత్తం రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం స్వయంగా గ్రామానికి వెళ్లి సంస్థ అధ్యక్షులు నంద్యాల ఖాసిం వలి, సంస్థ సభ్యులు కలసి అందజేశారు.