- పెంట్లవెల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించాలని, అలసత్వం వహించే చార్యలు తప్పవని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. పెంట్లవెల్లి కేజీబీవీలో కలుషిత ఆహారం – విద్యార్థినిలకు అస్వస్త ఘటనను మంత్రి జూపల్లి సీరియస్ గా తీసుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సోమవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కేజీబీవీ పాఠశాల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి అవగాహన సదస్సులో మంత్రి జూపల్లి పాల్గొని దిశా నిర్ధేశం చేశారు.
భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చార్యలు తీసుకోవాలని, లేకపోతే సంబంధిత అధికారులు, బియ్యం, పప్పులు, ఇతర సామాగ్రిని, కూరగాయాలు సరఫరా చేసే అధికారులు, ఎజెన్సీలపై కష్టపడిన చర్యలు స్పష్టమవుతున్నాం. విద్యార్థినులకు కేవలం తరగతి పాఠాలే కాక వ్యక్తిత్వ వికాసం నేర్పించటం, ఆటలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్‌లో ప్రోత్సహించాలని. వారిపై ఎలాంటి ఒత్తిడి ప్రభావం లేకుండా తీర్చిదిద్దాలని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాల్సి ఉందని సూచించారు. ఇంట్లో పిల్లలను ఎలాగైతే శ్రద్ధగా చూసుకుంటామో ఇక్కడ ఉన్న పిల్లలను కూడా మీ పిల్లలుగా భావించి అంతే జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం శుచి అయిన పౌష్ఠిక ఆహారం అందించాలని. సీజనల్ వ్యాధుల కాలం పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, పౌష్ఠిక ఆహారం అందజేస్తోందని, విద్యార్థినిల విద్యా ఆరోగ్యం పట్ల రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు.
నియోజకవర్గ అభివృద్ధికి వినియోగించే నిధులను పాఠశాలలు, హస్టల్స్‌లో మెరుగైన సౌకర్యాల కోసం కేటాయిస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కలుషిత నీరు, పురుగుల బియ్యం, కుల్లిపోయిన కూరగాయాలు సప్లై చేసే ఎజెన్సీలపై ఎందుకు చార్యలు తీసుకోరు అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగాని శుద్ధి చేయాలనీ, టెస్టింగ్ మిషను ఏర్పాటు చేయాలనీ సూచించింది. అవసరమైన చోట త్వరలోనే ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వసతి గృహంలో సౌకర్యాలపై మంత్రి జూపల్లి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సురక్షిత మంచి నీళ్ళు వస్తున్నాయా? లైబ్రరీలో పుస్తకాలు అక్కడ ఉంటున్నాయా అని ఆరా తీశారు. విద్యార్థులు లక్ష్యానుగుణంగా విద్యను అభ్యసించాల’ని, ఆలోచన తీరు కూడా గొప్పగా ఉండాల’ని.. అప్పుడే ఉన్న’త స్థానాలకు చేరుకునే అవకాశ లభిస్తుందని మార్గ నిర్ధేశం చేశారు. చదువుకు వయ’సుతో సంబంధం లేదు, అది నిరంతర ప్రక్రియ అని, స’మాజంలో పది మందికి ఉపయోగపడే విధంగా విద్యను అభ్యసించి ఉన్న’త శిఖరాలకు చేరుకోవాల’ని హిత’ చేశారు. కేజీబీవీల్లో ఏమైనా సమస్య ఉంటే నేరుగా తనకు గాని, కలెక్టర్‌కు కానీ ఫోన్ చేయాలని చెప్పి… తన నంబర్ ను విద్యార్థులకు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, విద్యా శాఖ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు.