54
తొండూరు మండలంలో ఈసారి వర్షాలు అధికంగా కురుస్తాయని ఆశలు పెట్టుకున్న రైతాంగానికి జూలై, ఆగస్టు నెలలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, దానికి తోడు ఎండాకాలాన్ని తలపించేలా ఎండలు ఉండటంతో గాలిలో తేమ శాతం తగ్గి పంటలు ఎండిపోతున్నాయి. వారం పది రోజుల్లో వర్షాలు రాకపోతే ప్రస్తుతం వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉండటంతో రైతాంగానికి దిక్కుతోచడం లేదన్నారు.