17
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని యూనిట్ -2 పరిధిలో కోల్ మిల్స్ వద్ద పైపులైను లీకేజీ కావడంతో నీరు ప్రవహిస్తోంది. ఈ నీరు అక్కడ పేరుకుపోయిన బూడిదతో కలిసి ప్రవహిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానిక ఉద్యోగులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా నిల్వ ఉన్న ఈ బూడిద నీళ్లను తొలగించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.