హీరోయిన్ల సినీ కెరీర్ చాలా తక్కువ. వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోతుంటారు. కానీ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత సినిమాలకు వెరీయేషన్ కనిపిస్తూ ఉంటుంది. ముందు సినిమాల కన్నా గ్లామరస్, ఫిట్‌నెస్ అండ్ బ్యూటీతో మెస్మరైజ్ చేస్తారు. అందుకు బిగ్గెస్ట్ ఉదాహరణ నటి త్రిష. సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ.. ఇప్పటికి అదే అందాన్ని మెయిన్ టైన్ చేస్తుంది. 40వ పడిలోకి వచ్చాక కూడా తరగని అందం ఆమె సొంతం. అలా కొంత మంది స్టార్ నటీమణులు మాత్రం పది, పదిహేను సంవత్సరాలు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఆ జాబితాలో ఈ నటి కూడా ఉంది. ఈ క్యూటీ పై చాలా కాలం తర్వాత తెలుగులో బిజీ అవుతుంది.
దక్షిణాది ఇండస్ట్రీని చుట్టేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తుంది. సుమారు 11 సంవత్సరాల తర్వాత ఓ క్యామియో అప్పీయరెన్స్ ఇవ్వడంతో ఓ మూవీ చేసింది. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌తో పలకరించింది. ఇండస్ట్రీలోకి వచ్చి దరిదాపుగా 20 ఏళ్లకు చేరువవుతుంది.. అయినా అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలతో ప్రస్తుతం మారింది. ఇంతకు ఆమె ఎవరంటే.. బాణం సినిమాతో అందరి మదిలో సుబ్బలక్ష్మీగా గుర్తిండిపోయిన వేదిక. ఈ కన్నడ కస్తూరి.. మహారాష్ట్రలో పెరిగింది. మద్రాసీ అనే తెలుగు సినిమాతో కెరీర్ స్టార్ చేసిన ఈ నాజూకు అందం.. మునితో ఫేమస్ అయ్యింది. తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన విజయదశమితో తెరంగేట్రం చేసింది కానీ.. ఆమె గుర్తుండి మాత్రం బాణం మూవీతోనే.
బాణం చిత్రంలో అమాయకురాలిగా మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్ కి దూరంగా మూవీ చేసి.. ఇండస్ట్రీకి దూరం జరిగింది. వరుస పెట్టి తమిళ్, మలయాళ, కన్నడ చిత్రాలతో బిజీ అయిపోయింది. ఆమెను తెలుగు ప్రేక్షకులు మర్చిపోతున్నారు అనుకున్న సమయంలో కాంచన 3తో పలకరించింది. బాలయ్య మూవీ రూలర్‌లో సంధ్య పాత్రలో కనిపించింది. బంగార్రాజులో క్యామియో పాత్రలో మెరిసింది ఈ బ్యూటీ. ఈ ఏడాది రజాకార్ చిత్రంలో యాక్ట్ చేసిన వేదిక.. తాజాగా హారర్ వెబ్ సిరీస్ యక్షిణిలో మాయ పాత్రలో భయపెట్టింది. ఆ సినిమా కోసం ఆమె ఎంత కష్టపడిందంటే ఆ మేకప్ చూస్తేనే అర్థమౌతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు చిత్రాలు ఉన్నాయి. కన్నడ చిత్రం గణతో పాటు ఫియర్, పెటరప్, వినోదన్, మాంద్రం తులసి, జంగిల్, నాళం తూను వంటి సినిమాలు చేస్తూ గడుపుతోంది.