47
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటి’ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇవాళ జేజమ్మ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. సిగార్ పీలుస్తూ ఆగ్రహంతో ముఖం నిండా రక్తంతో ఉన్న ఆమె వైల్డ్ ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వేదం’ తర్వాత వారి కాంబోలో తెరకెక్కుతున్న రెండో మూవీ ఇది. ఇవాళ సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానుంది.