డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. రాజమండ్రికి చెందిన దంపతులు పవన్‌కళ్యాణ్‌ను కలిసేందుకు వచ్చారు. ఆయన్ని కలుసుకోవడానికి వీలు పడక దగ్గరలోని ఓ ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. స్పందించిన పోలీసులు ఆ దంపతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి వచ్చారు.
రాజమండ్రి వాస్తవ్యులైన ఈ దంపతులకు సంబంధించిన 1200 గజాల ప్రసార ఓ మహిళా కార్పొరేటర్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు కబ్జా చేశారు, దాని గురించి ఫిర్యాదు చేయడానికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు పవన్‌కళ్యాణ్‌ని కలిసేందుకు వచ్చినా పోలీసులు అడ్డుకోవడంతో ఆ మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది.