74
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడికి పాల్పడినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్ 16న ఆయనపై నార్సింగి పోలీసులు 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు.