ముద్ర,ఆంధ్రప్రదేశ్:-పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. ఎంతోమంది ఆయన్ని కలవడానికి, వారి సమస్యలు చెప్పడానికి వస్తున్నారు. దీంతో అందరికి పవన్ కళ్యాణ్ అంటే మరింత గౌరవం ఏర్పడుతుంది. ఏదో మంచి చేస్తుంది, మార్పు తెస్తాడు అనే నమ్మకం కుదిరింది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రయోగం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
జనసేన అధికార సోషల్ మీడియా పేజీలలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు మంత్రుల కింద పంచాయితీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, పర్యావరణ శాఖ, సైన్స్ & టెక్నాలజీ, పౌర సరఫరాల శాఖ, టూరిజం & సినిమాటోగ్రఫీ శాఖలు ఉన్నాయి. అయితే తాజాగా జనసేన పార్టీ.. ఈ శాఖలకు సంబంధించి మీలో ఎవరైనా కోడ్ సూచనలు, సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వగలరు అని చెప్పి ఓ గూగుల్ ఫామ్ లింక్ (https://docs.google.com/forms/d/e/1FAIpQLSfTAgkNM01bsuVjZ13IKBDjtjPoIwD77_7mhQmmSGsYopcc), ఆ గూగుల్ ఫామ్ లింక్, క్యూఆర్ కోడ్ ద్వారా జనసేన పార్టీ ఇచ్చిన ఫామ్ లో ఆ శాఖలకు సంబంధించి మన సూచనలు సలహాలు ఇవ్వమని తెలుపుతూ పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వాలి అనుకుంటే QR ద్వారా లేదా లింక్ ద్వారా ఈ Google ఫారమ్ ఫిల్ చేయగలరు. ధన్యవాదాలు !
లింక్ : https://t.co/KZGvzp2hb3 pic.twitter.com/O3w63gOFmP
— జనసేన పార్టీ (@JanaSenaParty) జూన్ 24, 2024