ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా ఒక్కటే చర్చ. నీకు కల్కి (kalki 2898 ad)టికెట్ దొరికిందా అని. ఒక వేళ దొరికిందని చెప్తే మాత్రం నువ్వు తర్వాత చూడు కదా నాకు ఇవ్వమని ఒక్కటే గొణుగు. ఇక ప్రభాస్ (ప్రభాస్)ఫ్యాన్స్ అయితే టికెట్ ని అదే పనిగా చూసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. పైగా టికెట్ ని ఎవరి కంట పడకుండా చాలా భద్రంగా దాచుకుంటున్నారు. ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే అక్కడ ఉంది ప్రభాస్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్. నమ్మసఖ్యంగా లేకపోతే నేను చెప్పబోయే వార్త వినండి. నిజమే అని నమ్ముతారు.
తెలుగు రాష్టాల్లో కల్కి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యింది. అలా ఓపెన్ చేసారో లేదో హాట్ కేకుల్లా క్లోజ్. కానీ టికెట్ పొందని ఫ్యాన్స్ అయితే ఏకంగా నిర్మాత ఆఫీస్ ముందుకెళ్లి ధర్నా చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాలేదు..మాకు టికెట్స్ కావాలి అంటూ అశ్వనీ దత్ (అశ్వనీ దత్)ఆఫీస్ ముందుకెళ్లి మౌన దీక్ష. దీంతో నిర్మాణ బృందం ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుత చాలా మంది ఆహా ఎన్ని రోజులు అవుతుంది ఇలాంటి వార్తలు చూసి. ఇది కదా తెలుగు సినిమా సత్తా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది అయితే తెలుగు సినిమాకి రోజులు బాగోలేదని ఎవరు చెప్పారు. దేదీప్యమానంగా వెలుగొందుతుందని అంటున్నారు.ఏది ఏమైనా కల్కి టికెట్ దొరికినోళ్లు లక్కీ పర్సన్స్ అనే మాట తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతుంది.
రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు టికెట్ రేటు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాయి. అదే విధంగా అదనపు షోస్ కి కూడా అనుమతి ఇచ్చాయి. దీంతో తెలుగు సినిమాకి, ప్రభాస్ ఫ్యాన్స్ కి నూతన ఉత్తేజం వచ్చింది. కల్కి ట్రైలర్ ఒక రేంజ్ లో ఉండటంతో ఎప్పుడెప్పుడు ఇరవై ఏడు వస్తుందా అని సృష్టించారు.ప్రభాస్, అమితాబ్, కమల్ ,దీపికా పదుకునే స్క్రీన్ ప్రెజంటేషన్ ఎలా ఉండబోతుంది అంటే క్యూరియాసిటీ రోజు రోజుకి రెట్టింపు అవుతుంది. భారతీయ ఇతిహాసాల్లోని మరణం లేని వారి గురించి దర్శకుడు నాగ్ అశ్విన్(నాగ్ అశ్విన్)కల్కిద్వారా చెప్పబోతున్నాడు.