Home » కల్కి 2898 AD: తెలంగాణలో భారీగా పెరిగిన కల్కి టికెట్‌ రేట్లు.. ధర తెలిస్తే మైండ్ బ్లాంక్ – Sravya News

కల్కి 2898 AD: తెలంగాణలో భారీగా పెరిగిన కల్కి టికెట్‌ రేట్లు.. ధర తెలిస్తే మైండ్ బ్లాంక్ – Sravya News

by Sravya News
0 comment
కల్కి 2898 AD: తెలంగాణలో భారీగా పెరిగిన కల్కి టికెట్‌ రేట్లు.. ధర తెలిస్తే మైండ్ బ్లాంక్










ప్రస్తుతం ఎక్కడ చూసిన కల్కి.. పేరు మార్మోగిపోతుంది. ఈ సినిమా ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. మరో నాలుగు రోజుల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే చిత్రం బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో ఉన్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్‌ కల్కి సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డార్లింగ్‌ ఫ్యాన్స్‌ అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కల్కి నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాక ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ హైప్‌ను క్యాష్‌ చేసుకునేందుకు కల్కి టీమ్‌ని ప్రయత్నిస్తోంది. దాంతో టికెట్ ధరల పెంపుపై రెండు తెలుగు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసింది. ఈ ఆఫర్ తెలంగాణ సర్కార్ ఇందుకు ఆమోదం. ఆ వివరాలు..

డార్లింగ్ ప్రభాస్ ‘కల్కి’ సినిమా థియేటర్లలోకి రావడానికి మరో నాలుగు రోజులే ఉంది. బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ విధంగానే తెలంగాణ ప్రభుత్వం కల్కి టీమ్‌కు గుడ్‌ న్యూస్ చెప్పింది. టికెట్‌ రేట్ల పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. దాంతో తెలంగాణలో కల్కి టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. ఆ ధర చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం పక్కా. ఇంతకు టికెట్ ధర ఎంత పెరిగిందంటే..

తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో జూన్ 27 నుంచి జూలై 4 వరకు అంటే 8 రోజుల పాటు.. కల్కి టికెట్ ధరలు పెంచేందుకు అనుమతినిచ్చింది. అలానే సినిమా విడుదలయ్యే రోజు అనగా జూన్ 27న ఉదయం 5:30 గంటలకు బెన్‌ఫిట్ షో వేసుకోవడానికి కూడా అంగీకారం ప్రదర్శించారు. ఐదురోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు అనుమతిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అలానే ఒక్కో టికెట్‌పైన రూ.200 పెంచుకోవచ్చని చెప్పవచ్చు.

అదనంగా కల్కి సినిమా టికెట్ రేటు విషయానికి వస్తే.. సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.100 పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. దీనిబట్టి చూస్తే బెన్‌ఫిట్ షో కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ఒక్క టికెట్ కోసం రూ.377, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.495 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.265, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.413 రూపాయలుగా కల్కి టికెట్‌ ధర ఉండనుంది. ఇదేకాక ఆన్‌లైన్‌లో బుకింగ్, త్రీడీ గ్లాస్ ఛార్జీలు అదనం. దీనిని బట్టి తెలంగాణలో కల్కి సినిమా ఒక్కో టికెట్ ధర రూ.500కి మించే ఉండనుంది అని అర్థం అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి





You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in