- కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జిల్లా సూపరిండెంట్ చైతన్య గౌడ్
ముద్ర.వీపనగండ్ల:- నిర్వహించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్(సామాజిక ఆరోగ్య కేంద్రం) ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ జిల్లా సూపరిండెంట్ చైతన్య గౌడ్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యులను నియమించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను పెద్ద ఆసుపత్రికి తరలించడానికి కావలసిన అంబులెన్స్ గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం త్వరలోనే అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలోని కొందరు సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, దీనితో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారని విలేకరులు సూపరిడెంట్ దృష్టికి తీసుకురాగా మరో మారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రి సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చూపవద్దని సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక ఉన్నారు.