47
కృష్ణా జిల్లా పామర్రు టీడీపీ లో ఇసుక టెండర్ ల వివాదం రచ్చకెక్కింది. ఇసుక టెండర్ కోసం టీడీపీ నేతల మధ్య తగాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇసుక టెండర్ బెదిరింపు వీడియో కలవరం రేపుతోంది. ఈ వీడియో లో బెనర్జీ అనే టీడీపీ నేతకు ఇసుక టెండర్ వేయొద్దనేది.. ఎమ్మెల్యే వర్గం నేత సురేష్ బెదిరింపులకు పాల్పడినట్టు ఉంది. ఇసుక టెండర్ లో ఎవరూ పాల్గొనకూడదని సురేష్ హుక్కుం జారీ చేశారు. ఇసుక టెండర్ వేసిన వ్యక్తిని వెనకి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ఎమ్మెల్యే తో ఫోన్ లో మాట్లాడించిన వీడియో లీక్ అవ్వడం చర్చనీయాంశంగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.