Home » TET ఫలితాలు 2024 – టెట్ రిజల్ట్స్‌ ను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

TET ఫలితాలు 2024 – టెట్ రిజల్ట్స్‌ ను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
 TET ఫలితాలు 2024 - టెట్ రిజల్ట్స్‌ ను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఆయన ఈ వివరాలను తెలిపారు. 2,86,381 మంది అభ్యర్థులు మొత్తం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. పేపర్-1పరీక్షకు 85,996 మంది అభ్యర్థులు హాజరుకాగా, 57,725 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు.

పేపర్‌-2కు 1,50,491 మంది హాజరయ్యారని, వారిలో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు వివరించారు. పేపర్-1లో 67.13 శాతం, పేపర్-2లో 34.18 శాతం మంది అర్హత సాధించారని అధికారులు గుర్తించారు. 2023తో ప్రస్తుతం పేపర్-1లో 30.24 శాతం పేపర్-2లో 18.88 శాతం ఉత్తీర్ణత పెరిగింది. కాగా, ఫలితాలను https://tstet2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in