ఆగష్టు ఒకటి, రెండు తేదీలలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య, హైదరాబాద్ లో నిర్వహించబోయే జాతీయ స్థాయి జనరల్ బాడీ సమావేశాలను జయప్రదం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి కుమార్ అన్నారు. విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ పోకడలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. 18 రాష్ట్రాల నుండి ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్ ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు.