Home » మరో వివాదంలో తెలుగు IAS అధికారిణి రోహిణి సింధూరి.. స్టార్ సింగర్ ఫిర్యాదు – Sravya News

మరో వివాదంలో తెలుగు IAS అధికారిణి రోహిణి సింధూరి.. స్టార్ సింగర్ ఫిర్యాదు – Sravya News

by Sravya News
0 comment
మరో వివాదంలో తెలుగు IAS అధికారిణి రోహిణి సింధూరి.. స్టార్ సింగర్ ఫిర్యాదు










ఐఏఎస్ రోహిణీ సింధూరి నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఎస్ అధికారిణి రోహిణిపై ఐపీఎస్ ఆఫీసర్ డి. రూపా మౌద్గిల్ సోషల్ మీడియా వేదికగా కొన్ని విమర్శలు చేసిన సంగతి విదితమే. ఆమె వ్యక్తిగత పోస్టు చేసి.. అక్రమాలకు పాల్పడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. రోహిణీ వర్సెస్ రూపా అన్నట్లుగా నడిచింది. కర్ణాటకలో ఇద్దరు మహిళలు ఉన్నారు గొడవ పడటం హాట్ టాపిక్. చివరకు ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు కూడా చేరిన సంగతి విధితమే. రూపాపై పరువు నష్టం దాఖలు చేసింది రోహిణి. మేలోలు కూడా విచారణ జరగ్గా, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే బదులు సయోధ్య కుదుర్చుకోవాలని అత్యున్నత న్యాయం సూచించింది.

ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది ఈ మహిళా ఐఏఎస్. కర్ణాటక ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరిపై ప్రముఖ బాలీవుడ్ సింగ్ లక్కీ ఆలీ ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేశారంటూ ఆమెపై లోకాయుక్తలో కంప్లెంట్ చేశాడు. ఈ మేరకు ఆ కాపీని ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు అలీ. బెంగళూరు శివారులోని యెలహంక ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ భూమిని ఐఏఎస్‌ రోహిణి, ఆమె భర్త సుధీర్‌ రెడ్డి, బంధువు మధుసూదన్‌ రెడ్డి ఆక్రమించారని. ఈ కబ్జా చేయడంలో కొందరు పోలీసు అధికారులు సాయం చేశారు. 2022లోనే తాను ఏసీపీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని, స్థానిక పోలీసుల నుంచి తనకు ఎలాంటి సహాయం అందడం లేదని వరుస ట్వీట్లు చేశాడు.

ఇతర యెలహంక ECP మంజునాథ్‌, సర్వేయర్‌ మనోహన్‌ల హస్తం ఉంది. తమ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ.. రోహిణీ, కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అందుకే తాను లోకాయుక్త పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ మేరకు ఫిర్యాదుని ఆయన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. కాగా, సింగర్ లక్కీ ఆలీ ఫిర్యాదుతో యెలహంక న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలో ఐఏఎస్ అధికారిణి రూపా కూడా రోహిణిపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆమె అక్రమాలకు కారణమని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతోనే తన పరువు పోయిందని ఆమెపై ఫైర్ అయ్యింది రోహిణి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి







You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in