67
అమరావతి, ముద్ర వార్తలు: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్నిCRDA అధికారులు కూల్చి వేస్తున్నారు. తెల్లవారుజామున 5:30 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు, ప్రోక్లైన్‌తో కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలో రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభమైంది. అయితే నిర్మాణం అక్రమ అంటూ గతంలో CRDA అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు వైసీపీ కోర్టును ఆశ్రయించారు.