Home » హైపర్ ఆదికి ‘ఐ లవ్ యూ’ చెప్తానన్న హన్సిక.. కానీ ఓ కండిషన్! – Sravya News

హైపర్ ఆదికి ‘ఐ లవ్ యూ’ చెప్తానన్న హన్సిక.. కానీ ఓ కండిషన్! – Sravya News

by Sravya Team
0 comment
హైపర్ ఆదికి 'ఐ లవ్ యూ' చెప్తానన్న హన్సిక.. కానీ ఓ కండిషన్!


బుల్లితెరపై ఎన్నో షోలు ప్రేక్షకులను అలరిస్తూ ముందుకుసాగుతున్నాయి. అలాంటి షోల్లో ‘ఢీ’ డ్యాన్స్ షో ఒకటి. ఈ షోలో భాగంగా ప్రస్తుతం ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో కంటెస్టెంట్స్ తమ అద్బుతమైన డ్యాన్స్ లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక ఈ షోకు శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, లేటెస్ట్ గా హీరోయిన్ హన్సిక కూడా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. కాగా.. జూన్ 26 ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఎప్పటిలాగే డ్యాన్సర్స్ తమదైన స్టెప్పులతో అదరగొట్టగా.. ఆది తన మార్క్ కామెడీతో నవ్వించాడు. అయితే హైపర్ ఆదికి ఐ లవ్ యూని చెప్తానని మాటిచ్చింది హన్సిక. కానీ ఓ కండిషన్ పెట్టింది. అదేంటంటే?

హన్సిక.. దేశముదురు మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ యాపిల్ బ్యూటీ, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. పలు షోల్లో మెరుస్తోంది ఈ చిన్నది. ప్రస్తుతం ప్రముఖ డ్యాన్స్ షో అయిన ఢీ లో ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కు శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ లతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యహరిస్తోంది. ఇందులో కూడా తనదైన శైలిలో దూసుకెళ్తోంది హన్సిక. పంచులకే పంచులు వేసే హైపర్ ఆదికే కౌంటర్లు వేస్తోంది ఈ యాపిల్ బ్యూటీ.

ఇదిలా ఉండగా.. ఈ షోకు సంబంధించి తాజాగా ఓ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ప్రోమోలో హైపర్ ఆదికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది హన్సిక. ఈ ఎపిసోడ్ లో ఓ కంటెస్టెంట్ వేసిన ఫ్లోర్ స్టెప్ ను వేస్తే.. ఐ లవ్ యూ చెప్తానని ఆదికి ఆఫర్ ఇచ్చింది. దాంతో లుంగీపై ఆ ఫ్లోర్ స్టెప్ కాస్త కష్టమైనా ట్రై చేశాడు ఆది. ఆ స్టెప్ చూసిన శ్రీ సత్య, మరో అమ్మాయి నవ్వులు చిందించారు. హన్సిక సైతం అయ్యయ్యో.. అంటూ పగలబడి నవ్వింది. అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా లుంగీలో ఆది వేసిన ఫ్లోర్ స్టెప్ చూడలేకపోయారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

  • ఇదికూడా చదవండి: Kalki 2898 AD: వైరల్ అవుతున్న కల్కి నటి, నటుల రెమ్యూనరేషన్! ప్రభాస్ కు ఏకంగా అన్ని కోట్లా?

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in