తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనను ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నటి సమంత మరోమారు స్పందించారు. తన చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే సమస్యలను ఎదుర్కోగలిగానని చెప్పారు. తన తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సమంత.. ఈ రోజు తానిక్కడ కూర్చునేందుకు ఎంతోమంది మద్దతు ఉందని చెప్పారు. ఇండస్ట్రీలోని ప్రముఖుల ప్రేమ, తనపై వారికున్న నమ్మకమే తనను ఈ స్థాయిలో నిలబెట్టాయని పేర్కొన్నారు. వారు తన వైపు నిలబడకుంటే కష్టాలను ఎదుర్కొనేందుకు తనకు మరింత సమయం పట్టేదని చెప్పారు. ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై మాట్లాడుతూ.. ద్వేషపూరిత సందేశాలు వచ్చినప్పుడు వాటి ప్రభావం తనపై పడకుండా చూసుకుంటానని వివరించారు.
మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై మళ్లీ స్పందించిన టాలీవుడ్ నటి సమంత..
32
previous post