Home » Kalki 2898 AD: కల్కిలో చూపించిన శంబల నగరం ఎక్కడుంది.. ఇప్పటిదాకా ఎవరెవరు వెళ్లొచ్చారంటే..! – Sravya News

Kalki 2898 AD: కల్కిలో చూపించిన శంబల నగరం ఎక్కడుంది.. ఇప్పటిదాకా ఎవరెవరు వెళ్లొచ్చారంటే..! – Sravya News

by Sravya Team
0 comment
Kalki 2898 AD: కల్కిలో చూపించిన శంబల నగరం ఎక్కడుంది.. ఇప్పటిదాకా ఎవరెవరు వెళ్లొచ్చారంటే..!










ప్రభాస్ నటించిన కల్కి చిత్రం దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాపై మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరో ఐదు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు ట్రైలర్లు.. మూవీపై అంచనాలు ఆకాశానికి తీసుకెళ్లాయి. ఇక కల్కి సినిమా గురించి నాగ్‌ అశ్విన్‌లు, ట్రైలర్‌లు విడుదలైన ఇంటర్వ్యూ నాటి నుంచి దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు శంబల. మరి నిజంగానే ఈ నగరం ఉందా.. ఉంటే ఎక్కడ ఉంది.. ఇప్పటి వరకు ఎవరైనా శంబాలకు వెళ్లారా.. దీని గురించి పురాణాలు, వేదాల్లో ఎక్కడైనా ప్రస్తావన ఉందా అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

హిందూ పురాణాల ప్రకారం విష్ణువు దశవతారాల్లో కల్కి చివరి అవతారం. దీని ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కల్కి 2898 ఏడీ. కల్కిబోయే జన్మించిన పవిత్ర ప్రదేశమే శంబల. మరి ఈ స్థలం ప్రత్యేకత ఏంటి అంటే.. ఇది దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతమే శంబల. ఇది హిమాలయాల్లోని అంతుచిక్కని ప్రదేశం. శంబల సంస్కృత పదం. టిబెట్‌లో దీన్ని షాంగ్రిల్లా అంటారు. ఇక హిందూ పురాణాల్లో శంబలను సిద్ధాశ్రమం, భూలోక త్రివిష్టపం(భూలోక స్వర్గం) అని పిలుస్తారు. ఇది కైలాశ పర్వతం, మానస సరోవరం సమీపంలోనే శంబల ఉంది.

శంబాలకు దారిదే..

పురాణాలు, కొందరు చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం.. ఎవరెస్ట్‌ అడుగున ఓ సొరంగం ఉంది. దాని గుండ వెళ్తే.. గడ్డకట్టిన మంచునది ఉంటుంది. దాని అడుగున ఓ సొరంగం ఉంది. దాన్ని దాటితే ఓ పర్వతం వస్తుంది. దానిలో ఓ గుహ వస్తుంది. ఇక్కడ సిద్ధపురుషులు తపస్సు చేస్తుంటారు అని చెబుతారు. వారిని దాటుకుని వెళ్తే.. మంచుకొండల మధ్యన స్ఫటిక పర్వతం, శ్రీచక్రం కనిపిస్తుంది. ఈ స్ఫటిక పర్వతం కిందనే రహస్యంగా ఉన్న నగరం శంబల అంటారు. టిబెటన్లు.. శంబాలను ఇప్పటికీ మహిమాన్విత ప్రాంతంగా విశ్వసిస్తారు.

అలానే 13వ దలైలామా తన గురువు తాశీలామాతో కలిసి తాళపత్ర గ్రంథాల్లో ఎన్నో రహస్య విషయాలు ఉన్నాయి. వీటిలో శంబాలకు వెళ్లే దారి అనే పేరుతో తాశీలామా ఓ గ్రంథాన్ని రచించారు. ఈవెంట్ శంబాలకు వెళ్లే దారి గురించి ప్రస్తావన ఉంది. హిమాలయ పర్వతాలకు ఉత్తరాన ఉన్న మంచు పర్వతాల్లో ఓ రహస్య స్థావరం ఉంది. అక్కడ చాలామంది మహర్షులు ధ్యానంలో ఉన్నారు. శంబలలో వయసుని స్తంభింపజేసి నిత్యయవ్వనాన్ని ప్రసాదించే ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయని.. అక్కడున్న యోగులలో అద్భుతమైన శక్తులున్నాయని తాశీలామా గ్రంథంలో చెప్పారు.

ఇప్పటి వరకు ఎవరైనా శంబాలకు వెళ్లారా..

1903లో కొందరు భారతీయ శాస్త్రవేత్తలు, కొందరు గూఢచారులు శంబల నగరాన్ని అన్వేషిస్తూ.. వెళ్లారు. ఈక్రమంలో వీరు తమ ప్రయాణంలో.. హిమాలయాల్లో చూసిన వింతలన్నింటిపై ఓ నివేదిక తయారు చేశారు. ఇది అప్పట్లో.. పెను సంచలనం సృష్టించింది. ఈ నివేదిక చదివాక చాలా మంది శంబాలను చూడాలని ప్రయత్నాలు చేశారు. అయితే శంబల గురించి ప్రపంచానికి మొదట తెలియజేసిన వ్యక్తి నికోలస్‌ రోయిచ్‌. రష్యన్‌ చిత్రకారుడు, రచయిత, పురావస్తు శాస్త్రవేత్త, థియోసాఫిస్ట్‌, తత్వవేత్త అయిన నికోలస్‌ రోయిచ్‌.. రాసిన పుస్తకాల ఆధారంగానే జనాలకు శంబాల గురించిన మరిన్ని వివరాలు తెలిశాయి.

భారతీయ సంప్రదాయాలకు ముగ్ధుడైన రోయిచ్‌.. కులు ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని ఉండి. ఆయన మరణించే వరకు శంబల గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు. రోయిచ్‌ మరణం తర్వాత శంబాలకు సంబంధించిన రహస్యాలు చాలా వెలుగు చూశాయి. కులులో ఉన్న రోయిచ్‌ ఎగ్జిబిషన్‌లో.. ఈ వివరాలన్నీ ఉన్నాయి. రోయిచ్‌ శంబాలకు వెళ్లే దారిని ఓ చిత్రంలో రహస్యంగా చిత్రీకరించాడని.. ఆయన గీసిన బొమ్మల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. శంబాలకు వెళ్లే దారిని తెలుస్తుందని అంటారు.

ఇక రోయిచ్‌ రాసిన పుసక్తంలో కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన గుర్రం సకిలించడమే కాక.. ఈ జీవశిల దేశంలో అన్ని ప్రాంతాలలో తిరుగుతుందని.. సరిగ్గా కల్కి జన్మించడానికి ముందు శంబాలకు చేరుకుంటాడని రోయిచ్‌ తన రచనల్లో చెప్పుకొచ్చాడు. ఈ మెరిసే శిలనే చింతామణి అంటారు. కల్కిని వర్ణిస్తూ గీసే చిత్రాల్లో ఈ చింతామణి కనిపిస్తుంది.

శంబలపై హిట్లర్‌కు ఆసక్తి..

శంబల గురించి రోయిచ్‌ రాసిన పుస్తకాలు, గీసిన బొమ్మలను చూసిన తర్వాత శంబలపై నియంత హిట్లర్‌కు ఆసక్తి పెరిగింది. అక్కడ ఉన్న అద్భుత శక్తుల గురించి తెలుసుకోవాలని భావించిన హిట్లర్.. తన గూఢచారులను పంపించాడు. కానీ శంబల గురించి ఎలాంటి రహస్యం తెలుసుకోలేకపోయాడు. ఇక 1889వ శతాబ్ధంలో జన్మించిన సన్యాసిని ఆనందమయి హిమాలయాల్లో 20 అడుగుల ఎత్తున్న వారినిచూశానని చెప్పారు. వారంతా ద్వాపరయుగానికి చెందిన వారు అంటారు. అలానే రష్యాకు చెందిన హెలీనా అనే సాహసి కూడా తను రాసిన పుసక్తాల్లో శంబల గురించి ప్రస్తావించారు. ఇక భాగవత చివరి స్కంధంలో కల్కి అవతారం, శంబల నాగం గురించి, ధర్మ సంస్థాపన గురించి రాసుకొచ్చారు.

అయితే ఇప్పటికైతే శంబల ఇంకా మాయ నగరంగానే ఉంది. కల్కి లాంటి అవతారపురుషుడు జన్మించే భూలోక స్వర్గం లాంటి శంబాలను చూడాలంటే.. పరిపూర్ణమైన మనసు.. యోగశక్తి, దైవబలం ఉండాలి అంటారు పండితులు. అలానే కల్కి ఈ భూమి మీద జన్మించే వరకు ఈ నగరం.. మాయ నగరంగానే ఉంటుందని చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి





You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in